బెజ్జూరు సోమిని గ్రామాల మధ్య రోడ్డు మరి అద్వానంగా మారడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం ఓ ఆటోలో ప్రయాణిస్తూ పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయులకు పెను ప్రమాదం తప్పింది. బురదలో కూరుకుపోయి ఒక సైడు ఆటో ఒరిగిపోవడంతో ఉపాధ్యాయులు వెంటనే ఆటోలో నుండి దిగి పరుగులు తీశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు,