రావులపాలెం శివారు బండి రేవు పుంత రోడ్డులోని అరటి తోటలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు రావులపాలెం టౌన్ సీఐ ఎం.శేఖర్ బాబు తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35 ఏళ్ళు ఉంటుందని, చర్మం కమిలిపోయి ఉందని చెప్పారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.