విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలు పురస్కరించుకొని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో క్యూలైన్లు, ట్రాఫిక్ మళ్లింపు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపి ఏసిపి సీఐలు పాల్గొన్నారు.