నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకుల పహాడ్ గ్రామానికి చెందిన మూగవారైన అక్కా తమ్ముడు పూలమ్మ రాములు ఇంటి వద్దనే ఇటువర సదరం సర్టిఫికెట్ కోసం వైద్య బృందం వచ్చి పరీక్షలు నిర్వహించారు .ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సదరం సర్టిఫికెట్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని ఎంపీడీవో జ్యోతిలక్ష్మి స్థానిక గ్రామస్తుడు సుల్తాన్ ఎల్లయ్య సమక్షంలో అందజేశారు.