యానాం లో రూ.1.16 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శ్రీకారం చుట్టారు. కనకాల పేట, మెట్టకుర్రు, గణపతి నగర్, గోపాల నగర్, గిరియాం పేట ప్రాంతాల్లో రూ.1.16 కోట్ల నిధులతో చేపట్టిన రోడ్లు మరియు డ్రెయిన్లు నిర్మాణానికి ఎమ్మెల్యే గొల్లపల్లి భూమి పూజ చేసారు. కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలన అధికారి అంకిత్ కుమార్ ఇతర అధికారులు, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.