కంకటావ గ్రామంలో పంట పొలాల్లో కుళ్లిన శవం కేసులో సంచలన విషయాలు వెల్లడించిన బందరు DSP చప్పిడి రాజా మద్యంమత్తులో కన్న కొడుకును చంపిన కసాయి తండ్రి స్తానిక పెడన పట్టణం కంకటావ గ్రామంలో పంట పొలాల్లో కుళ్లిన శవం కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మద్యంమత్తులో తన కుమారుడు విఘ్నేశ్వర రావు (38) తో గొడవపడి, తానే చంపినట్లు తండ్రి వీరంకి నిరంజన్ రావు ఒప్పుకున్నాడని బందరు డీఎస్పీ రాజా శనివారం ఉదయం 10 గంటల సమయంలో తెలిపారు. తర్వాత శవాన్ని యూరియా సంచిలో వేసి పొలాల్లో పడేసినట్లు నిందితుడు అంగీకరించాడన్నారు.