భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయమైన పేరు మేజర్ ధ్యాన్ చంద్ అని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం పుట్టపర్తి కలెక్టరేట్లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడల ప్రాముఖ్యత తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజుకి ఒక గంటైనా ఆటలు ఆడాలని అభిషేక్ కుమార్ తెలిపారు. దీంతో ఆరోగ్యంగా ఉండి ఆయుష్షు పెరుగుతుందన్నారు. క్రీడలు దినచర్యలో భాగం కావాలన్నారు.