తిరుపతిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది ప్రియా ఆసుపత్రిలోని ఎనిమిదవ వార్డ్ లో ఈ ఘటన జరిగింది చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వేల్కూర్ కు చెందిన ఉమా మహేష్ గా ఓపి చీటీలో నమోదయి ఉన్నట్లు సమాచారం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది పోలీసుల విచారణలో తప్పుడు చిరునామా నమోదైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని ఎవరైనా గుర్తించిన ఎడల తిరుపతి వెస్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.