వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జీ. కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకర్షణీయంగా ఉండాలనే ఆలోచన కాకుండా పర్యావరణకు ప్రాధాన్యం ఇస్తూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని అన్నారు.మట్టి విగ్రహాల వలన నీటికి గాని, పర్యావరణానికి గాని ఎటువంటి హాని ఉండదని అన్నారు.