రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాఘవాపూర్ గేటు సమీపంలో షాద్నగర్ వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనం డీసీఎం ఢీ ఢీకొని ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి టిప్పర్ క్రింద పడడంతో వ్యక్తికి తీవ్రగాయాలు కావడం జరిగింది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.