పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిపై లారీ మరియు ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వారిని గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు స్థానికులు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆర్టీసీ బస్సులో ఉన్న సుమారు 18 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారి బంధువులు పిడుగురాళ్ల పట్నంలో ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు వారిని చెదరగొట్టారు.