పర్యావరణం కన్నతల్లి లాంటి ది . ప్రాణుల మనుగడ పర్యావరణం పై ఆధారపడి ఉంటుంది.పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ,కాపాడుకోవడం మనందరి బాధ్యత అని రాజ్యసభ మాజీ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతిదీ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో, రసాయనాలతో కూడిన భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం, పూజలు చేయడం, తర్వాత చెరువుల్లో గాని, కాలువల్లో గాని ,జలాశయాలలో గాని నిమజ్జనం చేయడం ద్వారా జల కాలుష్యం జరుగుతా ఉందన్నారు.