విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని పెరుమాలి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చెందిన రాము అనే 21 ఏళ్ల యువకుడు సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. జగన్నాథవలసలో వినాయక నిమజ్జనం కోసం ట్రాక్టర్ తీసుకొని వెళ్లిన రాము తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ తిరగబడి రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.