విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్త సుంకరపాలెం సమీపంలో ఉన్న దత్తుడు బంద వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. భారీ వర్షం కావడంతో బంద నుండి మృతదేహాన్ని బయటకు తీయడానికి స్థానికులు ఎవరూ ముందుకు రాకలేదు.. దీంతో కొత్తవలస పోలీసు స్టేషన్ లో ASIగా విధులు నిర్వహిస్తున్న జనార్ధనరావు తన ప్రాణాలు ఫణంగా పెట్టి పోలీసు యూనిఫాం తీసి బంధలోకి దిగారు. మృతదేహం వద్దకు అతి కష్టంగా చేరుకొని తాడు కట్టి మిగిలిన సిబ్బంది సహకారంతో బయటకు తీశారు. ఈ సందర్భంగా పలువురు ఏఎస్ఐ ను అభినందించారు.