పాతపట్నం మండల కేంద్రం నుంచి మెలియాపుట్టి రహదారిలో సుందరాడ గ్రామ సమీపంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఇరుక్కుపోయింది. దీంతో ఇరువైపులా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు టిప్పర్ లారీ లో ఉన్న లోడును ఇంకో వాహనంలోకి మార్చడంతో ఇరుక్కున్న టిప్పర్ ను జెసిబి ల సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. సుమారు మూడు గంటలు పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.