ఆడబిడ్డలను ఆర్థికంగా బరోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ యొక్క లక్ష్యమని పేర్కొన్నా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూపర్ సిక్స్ సూపర్ హిట్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైనందుకు శుక్రవారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం లోని టీటీడీ కల్యాణ మండపంలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆడబిడ్డల్లో చైతన్యం తెచ్చి, మహిళలకు పద్మావతి విశ్వవిద్యాలయం నెలకొల్పి, రిజర్వేషన్లు, ఆస్తి హక్కును కల్పించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు.