జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం జనగామ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై గానుగుపహాడ బ్రిడ్జి వద్ద ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు క్లీనర్ కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ తరలించారు. బ్రిడ్జి నిర్మాణం మధ్యలోనే నిలిపివేయడంతో తాత్కాల్కంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై లారీ వస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. మహారాష్ట్ర నుంచి సూర్యాపేటకు ఐరన్ లోడుతో లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.