పామర్రు శివారు శ్యామలాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలగల ప్రసాద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.