ప్రజా అర్జీలను వేగవంతంగా జాగ్రత్తగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజా అభిప్రాయ సేకరణను వేగవంతం చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు.సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తో కలిసి అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో 334 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు.