పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్, రెండేళ్లుగా పాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని ఆయన అన్నారు. శనివారం బేల మండలం మసాలా, దుబ్బాగూడ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.