ఎస్.రాయవరం మండలం కోనవానిపాలెం వద్ద 16 నెంబర్ జాతి రహదారిపై సోమవారం తెల్లవారుజామున సమయంలో ఆగి ఉన్న లారీని జగ్గంపేట వస్తున్న బైక్ ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే జగ్గంపేటకు చెందిన కాసా దుర్గాప్రసాద్, కుటుంబ సభ్యురాలతో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన విస్తృత స్థాయి సమావేశానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యలోని ఈ సంఘటన చోటు చేసుకుంది.