ప్రకాశం జిల్లా కొండపి మండలంలో శుక్రవారం పలు గృహాలను విద్యుత్ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న 27 మందిని గుర్తించిన అధికారులు రెండు లక్షల 50 వేల రూపాయల వరకు జరిమానా విధించారు. దాడులలో దాదాపు 36 బృందాలు పాల్గొన్నట్లు ఈవో పద్మావతి మీడియాకు శుక్రవారం రాత్రి తెలిపారు. అక్రమంగా విద్యుత్ వినియోగించడం చట్టరీత్యా నేరమని ఆమె హెచ్చరించారు.