గ్రామీణ ప్రాంతంలో సమగ్ర ఆస్తి ధ్రువీకరణ పరిష్కారాన్ని అందించడం స్వమిత్వ పథకం లక్ష్యం అని, జాగ్రత్తలు పాటిస్తూ సర్వేను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి పెడన మండలం నేలకొండపల్లి, మడక గ్రామాలలో పర్యటించి స్వమిత్వ సర్వే పురోగతిని పరిశీలించారు. తొలుత ఆయన మండలంలో నేలకొండపల్లి గ్రామంలోని పంచాయితీ కార్యాలయంలో స్వమిత్వ సర్వేకు సంబంధించి సిబ్బంది నిర్వహిస్తున్న రిజిస్టర్లు, మ్యాపులను క్షుణ్ణంగా పరిశీలించారు.