ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ఎవరైనా సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం 6గంటలకు ప్రైవేట్ ఆసుపత్రిల నిర్వాహకులకు "క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, PNDT చట్టం"పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసర మార్గాలు, లిఫ్టులు ఉన్నచోట అదనపు మెట్ల మార్గాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.