ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మరియు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నదాత పోరు గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ వైసిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9వ తేదీ ఎరువులు బ్లాక్ మార్కెట్ తరలింపు పై అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు అండగా నిలిచేందుకు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిరసన తెలిపి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు.