చంద్రగ్రహణం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని స్వయంభు శ్రీ చండీకా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆదివారము మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆలయ అధికారులు మూసివేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ తలుపులు మూసి వేసినట్లు ఆలయ అధికారులు అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణ అధికారి వెంకటయ్య అర్చకులు అనిల్ శర్మ పాల్గొన్నారు.