పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురువారం ఉదయం 11 గంటలకు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ, మాయాపట్నం గ్రామాల్లో పర్యటించారు. అలల తాకిడికి ధ్వంసమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని మత్స్యకారులు తమ ఆవేదనను వర్మ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.