ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఒక వైపు వినాయక నిమజ్జనాలు మరోవైపు సముద్రతీరానికి వచ్చిన పర్యాటకులతో తీర ప్రాంతం కిటకిటలాడింది అయితే అదే సమయంలో అలలు తాకిడి కూడా ఎక్కువగా ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తీర ప్రాంతం వద్ద పోలీసులు మెరైన్ పోలీసులు గస్తీని ఏర్పాటు చేశారు ఎవరూ కూడా సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్ళవద్దని చెబుతూనే మహిళలు చిన్నారులు నీటిలోకి దిగవద్దంటూ చిన్నారులను ఒంటరిగా వదలొద్దు అంటూ జాగ్రత్తగా తెలియజేశారు మరోవైపు సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గస్తీని ఏర్పాటు చేశారు.