ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీచెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. శనివారం కావడంతో ఆలయానికి వస్తున్న భక్తులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనాలు జరగలేదని అధికారులు అన్నారు. మళ్లీ శనివారమే ఆలయం తెరిచే నేపథ్యంలో మళ్లీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆలయ ఈవో తెలిపారు. అవసరమైతే కొండ ఎడ్జి ప్రాంతంలో నెట్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామన్నారు.