బేతంచర్ల పట్టణంలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో పూజా సామగ్రికి డిమాండ్ పెరిగింది. మంగళవారం మామిడాకులు, ఎలక్కాయ, గరక, చెరుకు గడలు వంటి పూజా వస్తువులను భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్ కోలాహలంగా మారింది. సెలవులపై ఊర్లకు వచ్చిన విద్యార్థులతో గ్రామాలు సందడిగా మారాయి.