ఓర్వకల్లు మండలం నన్నూరులో ఇంటి స్థలాలకు నెంబర్లు వేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి ఎస్.గౌస్ దేశాయ్, మండల నాయకులు లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్ విద్యాసాగర్‌కు వినతిపత్రం అందజేశారు. వెంటనే స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఈ నెలలో సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.