వినాయక నిమజ్జనానికి డీ జే కు ఎలాంటి పర్మిషన్ లేదని ఎస్సై మాధవరెడ్డి ఆదివారం తెలిపారు . కల్వకుర్తి పట్టణంలోని వినాయక నిమజ్జనానికి డీజే కు పర్మిషన్ లేదని, సిట్టింగ్ డీజేలు, సింగల్ పిన్ డీజే లు తదితర వాటికి కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వబడవని తెలిపారు, ఒకవేళ ఎవరైనా డీజే కు అడ్వాన్స్ ఇచ్చినచో నష్టపోతారని, తిరిగి అడ్వాన్సు తీసుకోవాలని సూచించారు, నిమజ్జనానికి డీజే లకు పర్మిషన్ వస్తదని అసత్య ప్రచారాలు నమ్మొద్దని స్పష్టం చేశారు. నిమజ్జనం ను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు.