నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండానే గతంలో నందికొట్కూరును నంద్యాల జిల్లాలో కలిపారని ప్రస్తుత ప్రభుత్వం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేస్తూ నంద్యాల వద్దు..కర్నూలు ముద్దు అంటూ నందికొట్కూరు పట్టణంలో గురువారం విద్యార్థులతో కలిసి సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ వరకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం ఎల్)లిబరేషన్ జిల్లా కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి, కేవలం 30 కి.మీ దూరంలో ఉన్న కర్నూలు జిల్లాకు కాకుండా,60 కి.మీ దూరంల