తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట పట్టణంలోని సత్తుపల్లి రోడ్ లో ప్రభుత్వ భూములు ఉన్న అక్రమ ఆక్రమణలను అధికారులు కూల్చివేయడంతో బాధితులు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రోడ్డు ఎక్కారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు.