పిచ్చాటూరు: భజన టీచరమ్మకి చిన్నారులు కన్నీటి నివాళి పిచ్చాటూరు అంగన్వాడీ టీచర్, పండరి భజన టీచరమ్మ శ్రీవాణి బుధవారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ వాణి పండరి భజన నేర్పిన చిన్నారులు ఆమె మృతి పట్ల తల్లడిల్లిపోయారు. చిన్నారులు అందరూ ఏకమై భజన డ్రెస్ కోడ్తో పిచ్చాటూరు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు. అక్కడ నుంచి గజమాలతో పండరి భజన వేస్తూ తోపు వీధిలోని శ్రీవాణి ఇంటికి చేరుకున్నారు. గజమాలను ఆమె భౌతిక కాయానికి వేసి నివాళులర్పించారు.