ఉల్చాల గ్రామంలో పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణం చెల్లించాలని సీఐటీయూ నాయకులు సిహెచ్.సాయిబాబా, బాలపీరా సుధాకరప్ప డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు మాట్లాడుతూ.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్మికులు 7 మంది, వాటర్‌లైన్ మెన్లు 5 మంది అనేక సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. నెలకు కేవలం రూ.6 వేలు వేతనం పొందుతూ ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్నా, నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.ఒక్కో కార్మికుడికి 7 నెలల నుంచి 15 నెలల వరకు వేతనాలు బాకీగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కుటు