సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం విట్టు నాయక్ తాండ లో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాథోడ్ ఆశ గ్రామ శివారులో గల వ్యవసాయ పొలం వద్ద శుక్రవారం సాయంత్రం చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది . రాత్రి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.