మంత్రాలయం: మండల కేంద్రం లోని ఎమ్మార్వో కార్యాలయంలో గురువారం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. మండలంలోని వగరూరు గ్రామానికి చెందిన వారు భూతగాదా విషయంలో ఘర్షణ పడ్డారు. ఎమ్మార్వో ఎదుటే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. కార్యాలయంలోని సిబ్బంది, సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఘర్షణ వాతావరణంతో భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.