నిరుపేదలకు సొంత ఇంటి కల సాకరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లా లో వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.రఘునాథ్ పల్లి మండలం మేకలగట్టు గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ నిర్మాణాలు త్వరితగతన పూర్తయ్యేలా చూడాలన్నారు.ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇసుక కూడా ఉచితంగా ప్రభుత్వమే ఇస్తుందని,మేస్త్రిలు కూడా నిర్ణయించిన ధర ప్రకారం ఇల్లు కట్టాలని,ఇల్లు కట్టుకునే లబ్ధిదారులు మేస్త్రి లకు ఎక్కువ ధర డబ్బులు ఇవ్వకూడదని అన్నారు.