నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గండి రామన్న దత్త సాయి బాబా ఆలయంలో పొలాల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోశాలలో సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోవులను ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీకృష్ణ భగవాన్ కు పూజలు జరిపారు అనంతరం పిండి పదార్ధాలతో నైవేద్యాలు చేసి తినిపించారు. అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను గోశాలలో నిర్వహించినట్లు తెలిపారు. ముక్కోటి దేవతలు కొలువైన గోవులను ప్రతి ఒక్కరు పూజించాలని కోరారు