పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష పడినట్లు ఏటూరునాగారం ASP శివం ఉపాధ్యాయ శనివారం రాత్రి తెలిపారు. 2022లో ఎలిశెట్టిపల్లిలో జరిగిన ఓ సంఘటనకు అదే గ్రామానికి చెందిన గౌస్‌పాషా (కిరాణంషాపు) వ్యక్తిపై కేసు నిర్దారణ కావడంతో అతడిపై జిల్లా న్యాయమూర్తి సూర్య చంద్రకళ 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించారు. అంతేకాక, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.