ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఏపూరి గ్రామ జాతీయ రహదారి సమీపంలో శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని గేదే మృతి చెందింది. గత మూడు రోజులుగా గుంతలుగా మారిన జాతీయ రహదారి పై మరమ్మత్తులకు నోచుకోలేక గుంతలు అలాగే దర్శనం ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు