Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధి నెల్లూరుపాలెం వద్ద జమీర్ అనే యువకుడు స్కూటర్ ను నడుపుతూ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతని కాలుకు తీవ్ర గాయం అయింది. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా అతన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడు అనంతసాగరం మండలం ఆమని చిరువెళ్ల వాసిగా గుర్తించారు.