కేంద్ర ప్రభుత్వం జిఎస్టి స్లాబ్ లను తగ్గించడంతో ఆ పార్టీ తాడిపత్రి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు అందుబాటులో జిఎస్టి స్లాబులను తీసుకువచ్చారని పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద పీఎం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారదారులు, సాధారణ ప్రజలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చిందని కొనియాడారు. ప్రజలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ, దేశానికి దీర్ఘకాలికంగా లాభాలు చేకూరతాయని ఆనందంగా తెలియజేశారు.