బ్రెయిన్ హెల్త్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలని పార్వతీపురం MLA బోనెల విజయ్ చంద్ర అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెయిన్ హెల్త్ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ నీత్ అయోగ్ ద్వారా హేబిడిషన్ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన బ్రెయిన్ హెల్త్ క్లినిక్ ను మన పార్వతిపురం మన్యం జిల్లాకి కూడా మంజూరు చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు.శరీర ఆరోగ్యంపై ఎంతయితే శ్రద్ధ తీసుకుంటున్నామో బ్రెయిన్ హెల్త్ పై కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.