కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఈనెల 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆదివారం ఉదయం 12 గంటలు కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో జాబ్ మేళా కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.