వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు దసరా రోజుల 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీకి ఆటో డ్రైవర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. 92 వార్డు గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడలిలో ప్రభుత్వ విప్ గణబాబు తనయుడు టిడిపి యువనేత శ్రీ మౌర్య సింహ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.