హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సూరవరం సుధాకర్ రెడ్డి పార్తివదేహానికి మాజీ మంత్రి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి నాయకుడి నుంచి అంచలంచెలుగా జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మనీయమైన ముద్ర వేసుకున్న వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు. సుధాకర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని అన్నారు.