డ్రైవర్ నిర్లక్ష్యం, మూడు కార్లను ఢీ కొట్టిన డీసీఎం, తప్పిన ప్రమాదం డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డుపై వాహనాన్ని ఆపి పక్కకు వెళ్లడంతో అది కాస్త ముందుకు వెళ్లి మూడు కార్లను ఢీ కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు శనివారం రాత్రి డీసీఎంను డ్రైవర్ రోడ్డుపై వాహనాన్ని నిలిపి పాన్ షాప్ కు వెళ్లాడు. అది న్యూటల్ అయి ముందుకు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న మూడు కార్లను ఢీ కొట్టడంతో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు