నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలోని రైతు ఆగ్రోస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల సోమవారం పడిగాపులు కాశారు. ఈ సందర్భంగా రైతు షేక్ అన్వర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం గత పది ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు .రైతులు బిచ్చగాళ్ళలాగా ఎరువుల షాపుల ముందు నిలబడటం బాధాకరమన్నారు .వెంటనే ప్రభుత్వ స్పందించి యూరియా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.